అమరావతిపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తా: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  Written by : Suryaa Desk Updated: Fri, Nov 15, 2019, 08:22 PM
 

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ఎంపీలపై విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. అమరావతిపై ప్రభుత్వ తీరును పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అన్నారు ఆరు నెలల పాలనలో ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఏం ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.