ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ కిల్లర్‌ బిన్‌ లాడెన్‌ ను పట్టుకునేందుకు అష్టకష్టాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 08:24 AM

ఎట్టకేలకు అసోం అటవీ అధికారులు బిన్‌ లాడెన్‌ ను పట్టేశారు. అవును నిజమే అసోం అటవీ అధికారులు పట్టుకున్నది మనుషుల ప్రాణాలను తీసేస్తున్న బిన్‌ లాడెన్‌ నే. అయితే ఈ బిన్‌ లాడెన్‌ ఒక ఏనుగు.అసోం గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు హరించేసిన ఓ ఏనుగుకు అక్కడి ప్రజలు ’ఒసామా బిన్‌ లాడెన్‌’ అని పేరు పెట్టారు. గత అక్టోబర్‌లో అసోంలోని గోల్పారా జిల్లాలో ఈ ఏనుగు ఐదుగురిని చంపేసింది. ఈ కిల్లర్‌ బిన్‌ లాడెన్‌ ను పట్టుకునేందుకు అష్టకష్టాలూ పడ్డారు. ఎప్పుడొస్తుందో, ఎక్కడ నుంచొస్తుందో తెలియకుండా ఒక్కసారిగా జనావాసాలపై దాడి చేసి అందిన వారిని అందినట్లు తొండంతో కొట్టో, కాళ్లతో మట్టి చంపేసి మళ్లీ అడవిలోకి పారిపోయే ఈ ఏనుగును అధికారులు పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com