వైభ‌వంగా కార్తీక‌ పౌర్ణమి గరుడసేవ

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 09:03 PM
 

తిరుమలలో మంగ‌ళ‌వారం రాత్రి కార్తీక‌పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.