చింతమనేనిని పరామర్శించిన మాజీ మంత్రులు

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:12 PM
 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత కలిశారు. ఈ మేరకు చింతమనేనిని పరామర్శించి.. పార్టీ అండగా ఉంటుదని భరోసా కల్పించారు. తెలుగు దేశం పార్టీలో చింతమనేని చురుగ్గా ఉండే నాయకుడని.. ఒక కేసుపై బెయిల్ రాగానే మరో కేసులో ఇరికించి జైలుకు పంతున్నారని మంత్రులకు అనుచరులు వివరించారు. దాదాపు 50 రోజులపైనే చింతమనేని రిమాండ్ లో ఉంచడం దారుణమని వాపోయారు. చింతమనేని ధైర్యంగా ఉన్నారని, ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని మంత్రులు సూచించారు.