ఉగాదికి ఇళ్లపట్టాలు ఇవ్వాలి : సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:10 PM
 

ఉగాదినాటికి ఏపీలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాదినాటికి ఇళ్లస్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వానికి "మానస పుత్రిక" లాంటిదని.. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని జగన్ కోరారు.  అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని.. లేని పక్షంలో భూములు కొనుగోలు చేయాలని జగన్ ఆదేశించారు. ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే.. వచ్చే నాలుగు నెలల్లో ఇంకా కష్టపడాలని సీఎం పేర్కొన్నారు. మన పరిపాలన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుందని సీఎం గుర్తుచేశారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంపైనే కలెక్టర్లు రేయింబవళ్లు కష్టపడాలని సీఎం జగన్ కోరారు.