మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి..

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:01 PM
 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మంచిది కాదని పవన్ హెచ్చరించారు. ప్రతి సారి మూడు పెళ్లిల్లలు చేసుకున్నాడట అని అంటున్నారు. మీరు కూడా చేసుకోండి. ఎవరు వద్దన్నారు అంటూ ఎద్దేవా చేసారు. అధికార పార్టీ తాను వ్యక్తిగతంగా విమర్శించినా తాము మాత్రం విధి విధానాల పరంగానే మాట్లాడుతామని పవన్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారి వారి భాషలకు ఇస్తున్న గౌరవాన్ని మనం మన భాషకు ఇవ్వడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. చిన్నతనంలోనే ఇంగ్లీష్ అంటూ పరభాషను పిల్లలపై రుద్దడం చేస్తే తెలుగు ప్రమాదం లో పడే అవకాశం ఉందని పవన్ అన్నారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా? అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా? అని జగన్ ను ప్రశ్నించారు.