ప్రతిపక్ష నేత కాస్త... కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు : విజయసాయి రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 07:47 PM
 

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన హుందాగా ఉండట్లేదని, అసూయ, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. 'ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయారు చంద్రబాబు నాయుడుగారు. అపోజిషన్ లీడర్‌గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.