ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం సవరించిన మార్గదర్శకాల విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 09:11 AM

అమరావతి : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం సవరించిన మార్గదర్శకాల విడుదల. ఆటోలు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న డ్రైవర్లకూ పథకం వర్తింపు. లబ్దిదారుడి తండ్రి/తల్లి/ కూతురు/ తమ్ముడి పేరుతో ఆటో ఉన్నా వర్తింపు. ఇరువురి పేర్లు వేర్వేరు రేషన్ కార‌్డుల్లో ఉన్నా పథకం వర్తింపు. బ్యాంకు అకౌంట్ మాత్రం ఆటో యజమాని పేరుతోనే ఉండాలని నిబంధన


లబ్ది దారుడికి కుటుంబ సభ్యులతో సంబంధాన్ని నిర్ధారించనున్న పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్లు. తెల్ల రేషన్ కార్డులో పేరు లేదన్న కారణంతో తిరస్కరించిన దరఖాస్తులకు మరో అవకాశం. ఇప్పటికే దరఖాస్తు తిరస్కరించిన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచన. దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేసేందుకు గడువు అక్టోబర్ 31 వరకూ పొడిగింపు. పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ల వద్ద నేరుగా ఇచ్చేందుకు అవకాశంనవంబర్ 8 కల్లా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి. నవంబర్ 10 కల్లా దరఖాస్తుల భవితవ్యం నిర్ధారించనున్న కలెక్టర్లు. నవంబర్ 15న ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి నగదు బదిలీ. నవంబర్ 20 కల్లా ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి సందేశం అందించనున్న వాలంటీర్లు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com