తిరుమలలో దివ్యదర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ అధికారులు రద్దు చేశారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్ల బయట నిలిచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 13వరకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.