ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులను నిరాశ పరిచిన అరసవిల్లి సూర్యనారాయణస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 11:42 AM

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణస్వామి భక్తులు నేడు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేడు స్వామి వారి మూలవిరాట్‌ను తాకాల్సిన సూర్యకిరణాలు మేఘాల కారణంగా ప్రసరించలేదు. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో భానుడి కిరణాలు స్వామి వారి పాదాలను తాకలేకపోయాయి. రేపు కూడా సూర్యుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్‌ను తాకుతాయి. అయితే, ఇందుకు వాతావరణం కరుణించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com