ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటిగా మారిన నాయకురాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 03:04 PM

ప్రకృతి వ్యవసాయంపై అవగాహనా కల్పించేందుకు ఓ నాయకురాలు నటిగా మారింది. ఆమె ఎవ్వరో కాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, గిరిజ‌న సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప‌శ్రీవాణి. వివ‌రాల్లో వెళితే .. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త‌ను తెలిపేలా రూపొందుతోన్న చిత్రం `అమృత‌భూమి`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ విజ‌య‌న‌గ‌రంలోని లోవ‌ముఠా ప్రాంతం గొర‌డ గ్రామంలో జ‌రిగింది. ఈ చిత్రంలో పుష్ప శ్రీవాణి ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. గిరిజ‌న సంక్షేమ ఆశ్ర‌మ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో డిప్యూటీ సీఎం న‌టించిన స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఆ స‌న్నివేశంలోనే అధికారి పాత్ర‌లో క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ న‌టించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ``ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించేలా, దాని ప్రాముఖ్యతను తెలియజేసేలా సినిమాను రూపొందిస్తున్నారు`` అన్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డానికే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com