గ్రామసచివాలయ ఉద్యోగాల్లో అగ్రతాంబూలం విశాఖజిల్లా మహిళా పోలీస్ వ్యవస్థకే దక్కింది. అత్యధికంగా ఈ విభాగంలో 1281 ఉద్యోగాలు జిల్లాలో భర్తీ కానున్నాయి. ఇక 2వ స్థానంలో 1183 పోస్టులతో హెల్త్ సెక్రటరీలు ఉండగా, 3వ స్థానంలో పంచాయతీ కార్యదర్శిలు, వీఆర్వోలు చెరో 739 ఉద్యోగాలు ఉన్నాయి. 4వ స్థానంలో 674 పోస్టులతో వెటర్నరీ అసిస్టెంట్లు, 5వ స్థానంలో వార్డు ప్లానింగ్, వెల్పేర్ సెక్రటరీలు చెరో 542 ఉద్యోగాలతో నిలిచాయి. అతితక్కువగా 3 ఉద్యోగాలతో సెరీకల్చర్ ప్రభుత్వ శాఖలు నిలవటం విశేషం.