బ్రహ్మోత్పవాలను పురస్కరించుకుని భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్రణాళిక బద్దంగా బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించేందుకు దాదాపు అన్ని విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం, పోటు, అన్నప్రసాద విభాగం, వసతి, కల్యాణకట్ట, వైద్య, ఆరోగ్య, ప్రజాసంబంధాల విభాగాలలో ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల కోసం ఈ అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోగా, మరికొందరు శ్రీవారి సేవకులు కూడా ఆయా విభాగాలలో తమ అనుభవాల మేరకు పనిచేసేందుకు ముందుకువచ్చినట్టు సమాచారం అందుతోంది.