ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు జడ్డిగా పలు కేసులకు భిన్న తీర్పులు ఇచ్చి. ఆపై మద్రాసు హైకోర్టు జడ్జిగా పని చేసి రిటైరయిన, జస్టిస్ నూతి రామ్మోహన్ రావుపైనా ఆతని భార్య, కుమారుడుపై ఇండియన్ పీనల్ కోడ్ , వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 498ఎ (భర్త, బంధువుల చేతిలో భార్య వేధింపులు), 323( ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 406(నమ్మకాన్ని వమ్ము చేయడం) కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. మాజీ జడ్జి, ఆయన భార్య, కుమారుడు కలసి ఎలాహింసించారో వెల్లడించే వీడియో ఫుటేజ్ ఇపుడు బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ వీడియోతో జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఆయన కుటుంబ సభ్యుల మీద ఐపిసి 354 ( దాడిచేయడం, అత్యాచారం చేసేందుకు వత్తిడి తీసుకురావడం) 307( హత్యాయత్నం) ల కింద కేసులు పెట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు ఈ నెల 23 న విచారణకు వస్తున్నది.