ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మానసిక స్థితి బాగుందా : పంచుమర్తి అనురాధ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 05:35 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో తిరిగే ధైర్యం జగన్ కు లేదని, జగన్ మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ కు పట్టిన దెయ్యాన్ని వదిలించే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. జాతీయ మీడియాలో సైతం వైసీపీ సర్కారును విమర్శిస్తూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. నవరత్నాలను వదిలేశారని, అన్ని అంశాల్లో వైసీపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు అరిచి గోల చేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com