1951 జులై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు జన్మించిన శివప్రసాద్ తిరుపతిలో ఎస్వీ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇక్కడే మాజీ సీఎం చంద్రబాబుతో ఏర్పడిత పరిచయంతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. శివప్రసాద్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా శివప్రసాద్ పనిచేశారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. స్వతహాగా రంగస్థల నటుడైన శివప్రసాద్ ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి క్యారక్టర్ ఆర్టిస్ట్, ప్రతి నాయకుడి పాత్రల్లో నటించారు. మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, తులసి, దూసుకెళ్తా, ఖైదీ, డేంజర్, కితకితలు సినిమాల్లో నటించారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటి రోజాా, ఇల్లాలు కొక్కొరోకో చిత్రాలకు శివప్రసాద్ డైరెక్షన్ వహించారు.