చంద్రయాన్ 2 ఆర్బిటార్ అనుకున్న విధంగా సక్రమంగా పని చేస్తోందని ఇస్రో ఛైర్మన్ శివన్ చెప్పారు. ఆర్బిటార్‌లో 8 పరికరాలు ఉన్నాయని, అవన్నీ కూడా వాటి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రుడిపై దిగిన విక్రమ్‌ను సంబంధాన్ని పునరుద్ధరించుకోలేకపోయామని ఆయన చెప్పారు. తమ తదుపరి ప్రాధాన్యత గగన్‌యాన్ మిషన్ అని ఆయన అన్నారు.