బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 06:23 PM
 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.