గోదావరిలో పర్యాటక బోటు మునక

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 02:34 PM
 

కాకినాడ:  గోదావరిలో పర్యాటకుల బోటుకు ప్రమాదం జరిగింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రయాణికులతో వెళుతున్న  బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 27 మంది సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోటులో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించినట్లు సమాచారం. కొంత మంది లైఫ్‌ జాకెట్లతో గ్రామస్థుల సహాయంతో బయటకు వచ్చినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.