ఫేస్‌బుక్‌లో వ్యతిరేకంగా పోస్ట్‌ పెట్టినందుకు దూషించాడని..ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 01:54 PM
 

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కొమరాడ మండలం వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ద్వారపురెడ్డి జనార్ధన్‌రావు దూషణలకు దిగడంతో తిరుపతినాయుడు అనే వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై ఫేస్‌బుక్‌లో వ్యతిరేకంగా పోస్ట్‌ పెట్టాడని తిరుపతినాయుడును ద్వారపురెడ్డి దూషించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.