వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 15, 2019, 01:27 PM
 

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన ఈరోజు వైసీపీ చేరారు. తోట త్రిమూర్తులతో పాటు భారీ సంఖ్యలో ఆయన అనుచరులు, కార్యకర్తలు అధికార పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితం మార్టీ మారవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జ్యోతుల నెహ్రూనుతో బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. తాను వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాననీ, ఈ విషయంలో వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైసీపీలో చేరానని తెలిపారు. ఏపీ భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రజలు సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నికున్నారని జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.  పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ ఎన్నడూ కాపుల గురించి మాట్లాడలేదన్నారు.