రేపు ఢిల్లీలో సిఎం జగన్‌ పర్యటన

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 25, 2019, 11:42 AM
 

  అమ‌రావ‌తి :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేపు (సోమ‌వారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అంతర్రాష్ట్ర మండలి స్థాయి సంఘం సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.