కార్ల చోరి ముఠా అరెస్ట్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 24, 2019, 03:51 PM
 

విజయవాడ జిల్లాలోని భవానీపురంలో కార్లను చోరి చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి, డీసీపీ విజయరామారావు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ ముఠా మొత్తం 10 కార్లు, 3 మోటార్ వాహనాల చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. తమిళనాడులోని దిండిగా ప్రాంతానికి చెందిన పెరుముల్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ఈ దొపిడీలకు పాల్పడుతున్నారని వివరించారు. చోరీ చేసిన వాహనాలను చెన్నైలో ట్రావెల్స్‌లో తిప్పేందుకు వీరు ప్లాన్ చేశారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులపై రాష్ట్రంలో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.19.20 లక్షల విలువ చేసే వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.