ప్రేమ పేరుతో మోసం.. రూ. 25 లక్షలు డిమాండ్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 23, 2019, 05:53 PM
 

ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించిన ఓ కీచకుడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మాయ మాటలు చెప్పి ఓ విద్యార్థినిని యువకుడు లోబర్చుకున్నాడు. అనంతరం రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. లేకుంటే ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ గత కొన్ని రోజులుగా బాధిత యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. యువకుడి వేధింపులు తట్టుకోలేక సత్యనారాయణపురం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచకుడిని అదుపులోకి తీసుకున్నారు.