ఇంటి ముందున్న వాహనాలకు నిప్పంటిచిన పోకిరీలు

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 22, 2019, 06:58 PM
 

ఆకతాయిలు రెచ్చిపోయి విజయవాడ సత్యనారాయణ పురంలోని శ్రీనగర్‌కాలనీలో ఇంటిముందు నిలిపి ఉంచిన రెండు ద్విచక్రవాహనాలు, కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు సీసాలో పెట్రోల్‌ తీసుకొచ్చి వాహనాలకు నిప్పంటించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వాహన యజమానుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో అజిత్‌సింగ్‌ నగర్‌లోనూ పోకిరీలు వాహనాలకు నిప్పంటించారు.