పోలవరంపై ఏదొక నిర్ణయం తీసుకోండి: ఎంపీ సుజనాచౌదరి

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 22, 2019, 06:40 PM
 

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎంపీ సుజనాచౌదరి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు. ఢిల్లీలో ఆయనను కలిసిన సుజనా పోలవరం ప్రాజెక్టుపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలలో గందరగోళం నెలకొందని, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుజనా కోరారు.