అసెంబ్లీ ఫర్నిచర్ ను మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు తీసుకెళ్లడం సహేతుకం కాదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. బుధవారం అయన మీడియాలో మాట్లాడుతూ తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా..వ్యక్తిగతంగా మాత్రమే ఈ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని అసెంబ్లీ ఫర్నిచర్ ను తీసుకెళ్లి, ఇంట్లో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి.. వాటిని తీసుకెళ్లండని అనడంలో అర్థమేంటని, కనీసం ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి ఏమైనా అధికారికంగా చెప్పారా? అని ప్రశ్నించారు. కోడెల అలా చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.