ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగుల అంగవైకల్యాన్ని ఎత్తిచూపారో... జైలుకే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 12:48 AM

దివ్యాంగులకు వున్న అంగవైకల్యాన్ని ఎత్తిచూపేలా మాట్లాడితే చట్టరీత్యా శిక్షార్హులే  అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు  తెలిపారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదలై న ఒక ప్రకటనలో దివ్యాంగులకు వున్న లోపాలను సూచిస్తూ కుంటి, గుడ్డి, గూని, మూగ, చెవిటి, పిచ్చోడు వంటి పదాలనుఉద్ధేశ్యపూర్యకంగా పలుకుతూ పిలిచి అవమానించేవారిపై దివ్యాంగల హక్కుల చట్టం-2016 లోని సెక్షన్‌ 92 (8) ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోచ్చు అనే విషయాన్ని ప్రజలు గమనించి వారి పట్ల గౌరవప్రదంగా మెలగాలని కోరారు.


తమను అవమానించినట్టు  దివ్యాంగుల నుండి అందిన ఫిర్యాదు నిజం అనితెలితే ఆరు నెలల నుండి 5 సంవత్సరాలు వరకు శిక్షను విధించే అవకాశం వుందని తెలిపారు. దివ్యారగులను వారి వైకర్యాలతో సంభోదించకుండా సమాజంలో సాధారణ ప్రజలుగా గౌరవిస్తు వారి పేర్లతోనే పిలవాలని జిల్లా కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com