ఈ నెల 20వ తేదీన నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయులు రెడ్డి మీడియాకు తెలిపారు. సోమవారం అయన ఓ ప్రకటన విడుదల చేస్తూ కోసమే పెట్టాలని అభ్యర్ధించామని, ఐసిఐసిఐ టీవీఎస్ కంపెనీ లోని జూనియర్ సేల్స్ ఆఫీసర్ పోస్టులకు ఇక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ బిఏ, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు మంగళవారం తమ విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్ ఫోటోల తమ ఆధార్ కార్డులను తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9491741151 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.