అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.