యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 19, 2019, 12:04 PM
 

ఢిల్లీలోని యమున నదిలో ప్రమాదకరస్థాయిలో వరద ఉధృతి ప్రవహిస్తోంది. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. యమునా ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా, డేంజర్ లెవల్ మార్క్ 204.50 మీటర్లు. ఇవాళ ఉదయం 204.70 మీటర్ల వద్ద వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.