వరద పరిస్థితిపై అమెరికా నుంచే సీఎం జగన్ ఫోన్ సమీక్ష

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 01:45 AM
 

ప్రస్తుతం  అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అక్కడ నుంచే శనివారం  ఫోన్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.   ఈ సందర్భంగా సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను  .  నిశితంగా పరిశీలించారు. కాగా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరదలు,విడుదల చేస్తున్నటువంటి జలాలపై ఆరా తీశారు ముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తూ,  బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి జాప్యం  ఉండరాదని అధికారులకు ఆదేశాలిచ్చారు.  ప్రస్తుతానికి వరదలు తగ్గుతున్నాయని, ఇకమీదట ఎలాంటి సమస్యలు ఉండవని సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివరించారు.