వేంకటగిరి చేరిన ఎన్.సి.సి విద్యార్థుల సైకిల్ యాత్ర

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 01:20 AM
 

భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో తిరుపతి 29 వ బెటాలియన్ కమాండెంట్ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్ శ్రీధర్ నేతృత్వంలో ప్రజల్లో నీరు కాలుష్యం ప్లాస్టిక్ పై అవగాహన కలిగిస్తూ చెన్నై నుండి న్యూఢిల్లీ వరకు సాగుతున్న ఎన్.సి.సి విద్యార్థుల ప్రధానమంత్రి స్వచ్ఛత పక్వాడా పాన్ ఇండియా సైకిల్ ర్యాలీ  శనివారం నెల్లూరు జిల్లా  వెంకటగిరి కి చేరుకుంది. ఈ ర్యాలీకి స్థానిక ప్రభుత్వ విద్యా సంస్థల ఎన్.సి.సి విభాగం అధికారులు విద్యార్థులు ,  స్థానిక పోలీసులు ఘన స్వాగతం పలికారు.  నీటి కాలుష్యం కారంముగా వస్తున్నా రుగ్మతలపై,  ప్లాస్టిక్ పదార్ధాలు, పాలిథిన్ సంచుల వాడకం వాళ్ళ ప్రజల్లో జరిగే నష్టాలపై తమ యాత్రలో ఎదురయ్యా గ్రామాలలో  అవగాహన కలిపిస్తున్నామని లెఫ్టినెంట్ కర్నల్ ఆర్ శ్రీధర్ ఈ సందర్భంగా మీడియాకి చెప్పారు.