టిటిడి స్థానిక ఆల‌యాల‌కు వెండి అభరణాలు బహుకరణ

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 12:49 AM
 

 టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి , కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాలస్వామివారికి తిరుప‌తికి చెందిన బ‌జాజ్ మోట‌ర్స్ డీల‌ర్లు శ్రీ ఆర్‌. శ్రీ‌నివాసులు, శ్రీ ఆర్‌.సాకేత్ రామ్‌లు 5.417 కేజిల వెండి అభరణాలను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌కు బహుకరించారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో శ‌నివారం ఉద‌యం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.


ఇందులో శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి 4.247 కేజిల వెండి బిందే, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాలస్వామివారికి 1.17 కేజిల వెండి శంఖుధార‌, చ‌క్ర‌ధార‌ల‌ను అందించారు.