దగ్గరుండి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసిన ఏపీ మినిస్టర్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 08:23 PM
 

మంత్రి అనే దర్పానికి దూరంగా ఉంటూ సింపుల్‌గా ఉండే ఏపీ మినిస్టర్స్‌లో పేర్ని నాని స్టైలే వేరు.  తాజాగా ఆయన రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్‌ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్‌ చేశారు. అంతకు ముందు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్ని నాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.