కృష్ణా వరదలు పూర్తిగా మానవ తప్పిదమే :దేవినేని

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 08:17 PM
 

కృష్ణా వరదలు పూర్తిగా మానవ తప్పిదం కారణంగా ఏర్పడిన విపత్తేనని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కేంద్ర హోంశాఖ కు, జలవరుల శాఖకు దీనిపై ఫిర్యాదు చేసి న్యాయ విచారణ కోరతామ న్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు ఎందుకని మండిపడ్డారు. అమరావతిని ముంచడానికే కుట్రపూరితంగా వ్యవహ రించారని సామాన్యులు సైతం మాట్లాడుతు న్నారన్నారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనే రాక్షసత్వం తప్ప మరొకటి లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగిన మంత్రులకు ప్రజలకు సహాయక చర్యలు అందించే తీరిక లేదా అని నిలదీశారు. వరద బాధితులకు భోజనం పెట్టాలంటే ఆధార్ కార్డు, తెల్ల కార్డు అడగటం దుర్మార్గమన్నారు.