ఏపీ గవర్నర్ ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 08:17 PM
 

ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం కాకినాడ పర్యటనకు బయల్దేరి వెళ్లిన గవర్నర్.. మార్గం మధ్యలో కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. బెజవాడ సిటీ, ఇబ్రహీంటపట్నం, రాజధాని ప్రాంతాల మీదుగా గవర్నర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లోని పలు గ్రామాలు భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని అధికార యంత్రాంగాన్ని కోరింది.


గతవారం సీఎం జగన్.. గోదావరి సమీపంలోని వరద ప్రభావిత ప్రాంతాలపై సర్వే నిర్వహించారు. ప్రధానంగా పోలవరం మరియు పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలోని ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. గోదావరి, కృష్ణా నదులలో నీటి మట్టం కూడా వేగంగా పెరుగుతోంది.