డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు : పవన్ కల్యాణ్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 08:01 PM
 

 కృష్ణా నది కి వరద ఉద్ధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మానేసి.. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం మంత్రుల బాధ్యతా?అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలదీశారు. వరద ఉద్ధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని, అందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదని పవన్‌ అన్నారు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేయాలని పవన్ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం, మునిగిందా?లేదా? అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు.