బీజేపీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మీసామ్రాజ్యం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 07:51 PM
 

గత ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి  జనసేన తరఫున పోటీచేసిన పుట్టి లక్ష్మీసామ్రాజ్యం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో 100 మంది కార్యకర్తలతో ఆమె కమలం కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అభ్యర్థిగా పెదకూరపాడునుంచి పోటీచేయగా 7200 ఓట్లు వచ్చా యన్నారు. ఎన్నికల సమయంలో తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టార న్నారు. కష్టపడి పనిచేసేవారికి జనసేనలో విలువలేదన్నారు. ఈ విషయాలు తనను ఎంతో బాధపెట్టాయని, అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.