వరద బాధితులకు అండగా ఉండాలి : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 07:44 PM
 

వరద బాధితులకు తెదేపా నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జులు, ఇతర నేతలు పాల్గొనాలన్నారు. బాధిత ప్రజానీకానికి అందరూ సంఘీభావంగా ఉండాలని సూచించారు. కృష్ణా నది వరదల్లో అనేక మంది నిరాశ్రయులు అయ్యారని, ఇళ్లు నీటమునిగి కట్టుబట్టలతో మిగిలారన్నారు. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పసుపు, కంద, నిమ్మ, అరటి, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.