చంద్రబాబు పై ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 06:52 PM
 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు శుక్రవారం ఇరిగేషన్ శాఖా అధికారులు డ్రోన్లు వదిలిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేసారు. తన ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు సీబీఎన్ ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఆయనేమైనా ఒసామా బిన్ లాడిన్ లాంటివాడా? లేదా తన పెరట్లో ఏదైనా దాచుకున్నాడా? ఊరకనే అడుగుతున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.