మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సంచలన ప్రకటన

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 06:10 PM
 

సార్వత్రిక ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేయనని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాంలో ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాన్ని మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది జరిగిన ఎన్నికలే తనకు చివరివని ఆయన తెలిపారు.