పార్టీ మార్పుపై స్పందించిన రాయపాటి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 06:07 PM
 

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండర్లు పిలవటం ద్వారా ఖర్చు తగ్గు తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనుకుంటున్నారు. అయితే వ్యయం పెరిగే అవకాశాలే అధికం అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన బాగుందన్నారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ ఎక్కడ జాయిన్ అవుతానో నాకే తెలిదు. బీజేపీ వాళ్లు వచ్చారు. నేనేమీ చెప్పలేదు. బీజేపీలో కానీ, వైసీపీలో కానీ చేరతానో లేక టీడీపీలోనే ఉంటానో చెప్పలేను అని అన్నారు.