ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరప్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం..

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 03:33 PM

యూరప్ దేశమైన ఉక్రెయిన్ లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్న‘టోక్యో స్టార్ హోటల్’లో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో హోటల్ అంతా వ్యాపించాయి. దీంతో 8 మంది సజీవదహనం కాగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు కష్టపడి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టోక్యో స్టార్ ఓ మధ్య తరగతి హోటల్. ఇందులో 273 గదులు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఈ హోటల్ లో ఎంతమంది ఉన్నారు? అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది? అన్న విషయాలపై ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com