ప్రమాదకర స్థితిలో ప్రకాశం బ్యారేజీ

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 03:17 PM
 

ప్రకాశం బ్యారేజీకి సామర్ధ్యానికి మించి వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువ నుండి బ్యారేజీకి 6.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా దిగువకు 7.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో టీఎంసీల నీరు ఉండగా పులిచింతల నుండి నీరును నియంత్రిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీపై భారీ వాహనాలతో పాటు కార్లు, ఆటోలను కూడా వెళ్లకుండా నిషేధం విధించారు. బ్యారేజీ బలహీనం ఉందని.. వాహనాల రాకపోకలు జరిగితే పగుళ్లు ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరికల బోర్డులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.