ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఏపీ గవర్నర్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 16, 2019, 01:17 PM
 

ఏపీ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. బ్లాక్ నెంబర్ 3వ వార్డ్‌లో రోగులను పరామర్శించారు. ఆరోగ్య శ్రీ వార్డ్స్ ఆరేషన్ థియేటర్లు, సర్జికల్ వార్డ్స్, సర్జికల్ ఐ.సి.యూలను గవర్నర్ పరిశీలించి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే డయాలసిస్, అల్ట్రా సౌండ్ విభాగం సైతం పరిశీలించి.. కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వసతులు సంతృప్తినిచ్చాయన్నారు. పేదలకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు భేష్ అని గవర్నర్ కొనియాడారు.