వాజ్‌పేయీ ప్రథమ వర్ధంతి.. నేతల నివాళి

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 16, 2019, 09:39 AM
 

మాజీ ప్రధాని దివంగత నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ప్రముఖ నేతలు, భాజపా పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం అటల్‌ సదైవ్‌ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయీ కూతురు నమితా భట్టాచార్యతో పాటు మనవరాలు నిహారిక సైతం శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్‌పేయీ గత సంవత్సరం ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1998-2004 మధ్య ప్రధానిగా సేవలందించారు. ఆయన జయంతి డిసెంబర్‌ 25ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.