రెండున్నర నెలల్లోనే విప్లవాత్మక చట్టాలు: జగన్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 15, 2019, 12:14 PM
 

రెండున్నర నెలల్లోనే విప్లవాత్మక చట్టాలను తెచ్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జగన్‌ మాట్లాడారు. అవినీతి రూపుమాపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం మనదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం చేశామని పేర్కొన్నారు. అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యంషాపులు నిర్వహిస్తామన్నారు. పంటల పరిహారం అందించేలా చట్టం తెచ్చిన ప్రభుత్వం మనదన్నారు. రైతులు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.