జెండా ఎగురవేసిన పవన్ కల్యాణ్

  Written by : Suryaa Desk Updated: Thu, Aug 15, 2019, 10:07 AM
 

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటలో మోదీ జాతీయ జెండాను ఎగరువేయగా.. ఇటు ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేశారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.