అవినీతిపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదు : సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Wed, Aug 14, 2019, 04:39 PM
 

అమరావతి: అవినీతిపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని, వెనకుడుగేసే ప్రసక్తే లేదన్నారు సీఎం జగన్. అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో మాట్లాడిన సీఎం నాపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, కానీ ఒత్తిళ్లకు లోంగే ప్రసక్తేలేదన్నారు. ముందుగా రివర్స్ టెండరింగ్ విధానంలో వెంటనే నిర్ణయాలను తీసుకోవాలని, మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందాలన్నారు. దేశంలో అత్యున్నత విధానంతో పాలన అందించాలని ఆలోచిస్తున్నానని, అందరు అందరూ సహరించాలని కోరారు.